- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi : దొంగలా మారి కావ్య డిజైన్స్ కొట్టేసిన రాజ్
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ( brahmamudi ) ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
మూర్తిని తిట్టేసి అక్కడి నుంచి వెళ్లిపొమని చెబుతాడు. కొంత సేపటికి మూర్తి , రాజ్ అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు. " మూర్తి చెప్పింది నిజమే కదా .. ఆ కావ్య డిజైన్స్ అందరికంటే చాలా బాగుంటాయి. తనవి దొంగతనం చేసి , క్లయింట్ కు అవే చూపించి.. పోటీలో నేనే గెలుస్తా’ అని అనుకుంటూ ఉంటాడు. ఇక, రాజ్ అనుకున్న ప్రకారమే కావ్య క్యాబిన్ దగ్గరకు వెళ్లి చూస్తుంటాడు. అప్పటికి కావ్య, శ్రుతి ఇద్దరూ ఒకే దగ్గర ఉంటారు. ‘మేడమ్ మీరు వేసిన డిజైన్స్ సూపర్ గా ఉన్నాయి. క్లయింట్‌కి కి చూడగానే నచ్చేస్తాయి. వీటిని తీసుకుని మనం వెళ్లిపోదాం? ఇక్కడ ఎందుకు ఉంచడం దేనికి ?’ అని కావ్యతో శ్రుతి అంటుంది.
"లేదు శ్రుతి.. నేను ఇక్కడే ఉంచుతాను వీటిని.. మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే అక్కడ మరిచిపోతే చాలా ప్రాబ్లెమ్ అవుతుంది. అందుకే ఇక్కడుంచుతా.. ఇక వెళ్ళిపోదాం పదా ’ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది అంతా చాటుగా విన్న రాజ్.. వెళ్లిపోండి త్వరగా .. నా పని నేను చేసుకుంటాను అంటూ పక్కకు తప్పుకుని.. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అంటూ కావ్య క్యాబిన్‌లోకి వెళ్లిపోతాడు.
కమింగ్ అప్ ఎపిసోడ్ లో ‘ఇప్పుడు వీటిని ఇలా తీసుకోవడం తప్పు కాదుగా.. అయినా ఇది దొంగతనం ఏమి కాదు.. నేను కళావతిని అంతక ముందు ప్రేమగా చూసుకున్నాను. కావ్య నాకు ఎలాగో రుణం తీర్చాలి కదా దీనితో సరి పెట్టుకుంటా " అని ఫొటోస్ తీసుకుంటాడు రాజ్.