Phone tapping : హరీశ్ రావు నా ఫోన్ ట్యాప్ చేయించారు.. జూబ్లీహల్స్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత

by Ramesh N |
Phone tapping : హరీశ్ రావు నా ఫోన్ ట్యాప్ చేయించారు.. జూబ్లీహల్స్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి బీఆర్ఎస్ అగ్రనేత పేరు తెరపైకి వచ్చింది. ఫోన్‌ట్యాపింగ్‌పై గతంలో డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసీపీకి సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్ (Chakradhar goud) బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) పై ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని, మాజీ మంత్రి హరీశ్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండు సార్లు పోలీసులు విచారణ చేశారు. పోలీసులు ఆదేశంతో సోమవారం మరోసారి జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చిన చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ.. సిద్దిపేటలో హరీశ్ రావు ఓడిపోతారనే భయంతోనే తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. (BRS) బీఆర్ఎస్ సర్కార్ చేసిన రంగనాయక సాగర్ స్కామ్ బయటపెట్టానని చక్రధర్ గౌడ్ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో వారి ఫోన్ ట్యాపింగ్ (KTR) కేటీఆర్ చేస్తే.. పొలిటికల్‌ వాళ్లవి హరీశ్ రావు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్ రావుని పిలిచి విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం బయటపడుతుందని అన్నారు. గతంలో రెండు సార్లు పోలీసులు పిలిచి వివరాలు తీసుకున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed