- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జంగాలపల్లిలో వరుస మరణాలకు కారణం ఏంటి..? పూజారి చెప్పేది నిజమేనా..?
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత రెండు నెలలుగా 20 కి పైగా మరణాలు సంభవించిన వార్త రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పోలీస్, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు జంగాలపల్లిలో స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులలో ఉన్న భయాన్ని తొలగించి భరోసా కల్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ జంగాలపల్లి గ్రామస్తులు మాత్రం బొడ్రాయి వేరేచోట ప్రతిష్టించడం వల్లనే గ్రామంలో అంతుపట్టని మరణాలు జరుగుతున్నాయని బొడ్రాయికి శాంతి పూజలు చేస్తున్నారు.
బొడ్రాయికి శాంతి పూజలు
జంగాలపల్లి గ్రామంలో ఇటీవల జరుగుతున్న మరణాలపై గ్రామంలోని పెద్దమనుషులు పురోహితుడిని సంప్రదించారు గ్రామస్తులు. అయితే వేరే చోట నుంచి బొడ్రాయిని మార్చి ప్రతిష్టించడం వల్లే గ్రామానికి ఇలాంటి అర్ధాలు జరుగుతున్నాయని ఆయన సెలవిచ్చారు. అంతే కాదు.. బొడ్రాయికి ప్రతి ఇంటి నుంచి నీటితో అభిషేకం చేసి, కొబ్బరికాయ కొట్టి శాంతి పూజ చేయాలని తెలిపారు. దీంతో గ్రామస్తులు బొడ్రాయికి శాంతి పూజలు చేసే పనిలో పడ్డారు.
గ్రామంలో మెగా హెల్త్ క్యాంపులు..
ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో మరణాలకు గల కారణాలను తేల్చేందుకు ములుగు జిల్లా డీఎం అండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. గ్రామంలో మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి వేర్వేరు చోట్ల హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. గ్రామస్తుల బ్లడ్ శాంపిల్స్, ఆరోగ్య పరిస్థితి, తాగునీటి శాంపిల్స్ తీసుకొని మరణాల గల కారణాలను విశ్లేషిస్తున్నారు. గ్రామస్తులకు ఆరోగ్యం పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
కళాబృందాలుతో పోలీసుల ఎంట్రీ
జంగాలపల్లి గ్రామంలో జరుగుతున్న మరణాలకు మూఢనమ్మకాలే కారణమని నమ్ముతున్న ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసు కళాబృందాలతో గ్రామస్తుల్లో ఉన్న మూఢనమ్మకాలను పోగొట్టేందుకు కళాకారులతో అవగాహన చేపట్టారు.
ఃపారిశుధ్యం పై పంచాయతీరాజ్ శాఖ ఫోకస్
జంగాలపల్లిలో మరణాల కట్టడికి పంచాయతీరాజ్ శాఖ తమ వంతు ప్రయత్నంగా చర్యలకు ఉపక్రమించింది. గ్రామంలో పారిశుద్ధ సిబ్బంది ఇంటింటికి వెళ్లి డ్రైనేజీ క్లీన్ చేయడం, మురికి నీరు ఉన్నచోట బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. దోమల నివారణకు యాంటీ లార్వా స్ర్పే చేస్తూ ఇండ్లలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు.