- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kangana Ranaut: ఫలించిన కంగనా రనౌత్ నిరీక్షణ.. ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ (ట్వీట్)
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కంగన ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఇందులో అనుపమ్ ఖేర్(Anupam Kher), మహిమా చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తయి ఏడాది అవుతోంది.
కానీ విడుదలకు నోచుకోలేదు. ‘ఎమర్జెన్సీ’(Emergency) రిలీజ్ ఎన్నో సార్లు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సెన్సార్ విషయంలోనూ ఆలస్యం కావడంతో ఇప్పటివరకు పలుమార్లు వాయిదా పడింది. అంతేకాకుండా విడుదలను అడ్డుకునేందుకు ఓ వర్గం వారు కోర్టు వరకు కూడా వెళ్లారు. దీంతో కంగనా చాలాసార్లు వాయిదా పడినందుకు బాధపడింది.
ఎట్టకేలకు కంగనా నిరీక్షణ ఫలించింది. ‘ఎమర్జెన్సీ’(Emergency) విడుదల విషయంలో చిక్కులన్నీ తొలగిపోయాయి. ఈ విషయాన్ని తెలుపుతూ కంగనా(Kangana Ranaut) ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 17న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న కంగనా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
17th January 2025 – The epic saga of the nation’s most powerful woman and the moment that altered India’s destiny. #Emergency – Unveils Only in cinemas on 17.01.2025! @KanganaTeam @AnupamPKher #SatishKaushik @shreyastalpade1 #MahimaChaudhry @milindrunning #VishakNair… pic.twitter.com/dC0gnYSNlW
— Kangana Ranaut (@KanganaTeam) November 18, 2024