బై బై మేడమ్...ముగిసిన రాష్ట్రపతి పర్యటన

by Sridhar Babu |   ( Updated:2024-12-21 14:35:06.0  )
బై బై మేడమ్...ముగిసిన రాష్ట్రపతి పర్యటన
X

దిశ, మేడ్చల్ బ్యూరో : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ప్రశాంతంగా ముగిసింది. పర్యటన ముగించుకొని శనివారం హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భారత గనుల మంత్రిత్వ శాఖ కిషన్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కలెక్టర్​ గౌతమ్ తదితరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం నగరానికి వచ్చి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఐదు రోజుల పాటు బస చేశారు.

అభినందించిన కలెక్టర్ గౌతమ్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన విజయవంతం చేయడంలో జిల్లా స్థాయిలోని అన్ని శాఖల అధికారుల పాత్ర ఎంతో అభినందనీయమని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది శనివారంతో ముగియడంతో ఆమె ఢిల్లీకి బయల్దేరిన అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ...భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నప్పటి నుంచి ఐదు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ఎంతో బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించారని కొనియాడారు.

అలాగే పోలీసు అధికారులు, సిబ్బంది , జిల్లా రెవెన్యూ శాఖ, సమాచార, రహదారులు, విద్యుత్తు, అటవీ శాఖ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, సివిల్ సప్లయ్​, అగ్నిమాపక శాఖతో పాటు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పని చేయడం వల్లే రాష్ట్రపతి పర్యటన విజయవంతంగా ముగిసిందని అన్నారు. వారందరికీ కలెక్టర్ అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed