IND vs AUS : టీమ్ ఇండియాకు భారీ షాక్.. మళ్లీ గాయపడిన స్టార్ బ్యాటర్

by Harish |
IND vs AUS : టీమ్ ఇండియాకు భారీ షాక్.. మళ్లీ గాయపడిన స్టార్ బ్యాటర్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. శనివారం ప్రాక్టీస్‌ చేస్తుండగా అతని కుడి చేతి మణికట్టుకు గాయమైంది. వెంటనే ఫిజియో వచ్చి రాహుల్ చికిత్స అందించాడు. అయితే, రాహుల్ గాయం తీవ్రతపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఆసిస్ గడ్డపై రాహుల్ నిలకడగా రాణిస్తున్నాడు. మూడు టెస్టుల్లో 235 పరుగులు చేసిన అతను.. భారత్ తరపున టాప్ స్కోరర్‌గా, మొత్తంగా సెకండ్ లీడింగ్ స్కోరర్‌గా ఉన్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్ కీలకమైన మెల్‌బోర్న్ టెస్టుకు దూరమైతే భారత్‌కు భారీ లోటే. అయితే, తొలి టెస్టుకు ముందు రాహుల్ గాయపడ్డాడు. కానీ, మ్యాచ్‌ నాటికి ఫిట్‌నెస్ సాధించాడు. ఇప్పుడు అదే చేతి మణికట్టుకు గాయం కావడంతో నాలుగో టెస్టుకు రాహుల్ అందుబాటులో నెలకొన్నాయి.


Advertisement

Next Story

Most Viewed