మైనర్ బాలికపై లైంగిక దాడి..యువకుడిపై పోక్సో కేసు

by Aamani |
మైనర్ బాలికపై లైంగిక దాడి..యువకుడిపై పోక్సో కేసు
X

దిశ,నాగిరెడ్డిపేట : మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్ చేసి లైంగికంగా దాడి చేసిన ఓ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు గోపాల్ పేట్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నమ్మించి, ఈ నెల 5 వ తేదీన కిడ్నాప్ చేసి హైదరాబాద్ లోని షాపూర్ నగర్ లో బాలికతో కలిసి ఉంటూ గత 13 రోజులుగా లైంగికంగా దాడి చేసినట్లు తెలిపారు. అయితే కిడ్నాప్ చేసిన యువకుడి కోసం మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గత 13 రోజులుగా గాలిస్తున్నామన్నారు.

కాగా శనివారం కిడ్నాప్ కు గురైన బాలికను గోపాల్ పేట్ లో వదిలేసి బైక్ పై పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. లైంగిక దాడికి గురైన బాలికను జిల్లా భరోసా సెంటర్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడ్ని అరెస్ట్ చేసి అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లారెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed