- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడీసీ స్థలం కబ్జా లొల్లి తెరపైకి..ఫైళ్ల మాయం వారికి కలిసొచ్చేలా చేస్తుందా...?
దిశ, భిక్కనూరు : భూములు,స్థలాలకు విలువ లేని సమయంలో తెల్ల కాగితాలపై, పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్న ఒప్పందాలకు రోజురోజుకు విలువ లేకుండా పోతుంది. అప్పట్లో మాటకు కట్టుబడి, సాదా కాగితాలలో రాసుకున్న ఒప్పందాలకు మాటపై నిలబడి ఉండేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా, భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, నిజాయితీగా రాసుకున్న కాగితాలను ప్రస్తుత చెత్త బుట్ట దాఖలు చేసి ఎదురు తిరగడం రివాజ్ గా మారింది. కొన్నేళ్ల క్రితం భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే దారికి, ఆపోజిట్ దారిలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం అప్పట్లో వీడీసీ నుండి గ్రామ పంచాయతీకి ఎకరం స్థలం కొనుగోలు చేసింది. అయితే ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంత కాలం క్రితం దొంగ పట్టాలతో కబ్జా చేసే ప్రయత్నం చేయగా, పట్టణంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అయితే స్థలానికి సంబంధించిన ఫైళ్ళ ముల్లె గ్రామ పంచాయతీ భవనాన్ని అధునాతనంగా నిర్మిస్తున్న సమయంలో మాయం కావడం, ఇదే అదనుగా చేసుకుని కొందరు మధ్య దళారులు, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అప్పట్లో జరిగిన ఈ ఇష్యూ రచ్చ కావడం, ఆ ఇష్యూ ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న సమయంలో తాజాగా వెంచర్ కోసం స్మశాన వాటిక స్థలాన్ని కొందరు చదును చేసి, కబ్జా చేసే ప్రయత్నం చేయగా అక్కడి కాలనీవాసులు పెద్దమనుషులు అడ్డుకున్నారు. అయితే అప్పట్లో రాసుకున్న ఒప్పందాలకు సంబంధించిన కాగితాలకు సంబంధించి, ఎటువంటి ఆధారాలు పంచాయతీలో లేకపోవడం, వెంచర్ ఏర్పాటు చేయాలనుకునే వారికి కలిసి వచ్చేలా చేసింది. స్మశాన వాటిక కోసం 1996లో పట్టాదారుల నుంచి ఎకరం స్థలం గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో తీసుకున్నారు. అందుకు సంబంధించి కాగితాలు కూడా రాసుకున్నారు. అయితే ఆ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు ఎవరి వద్ద లేకపోవడం,ఉన్న ఏకైక ఆధారం గ్రామపంచాయతీ. ఈ విషయమై అక్కడికి వెళ్లి అడిగితే అందుకు సంబంధించిన ఫైళ్ళు కానీ పత్రాలు కాని తమ వద్ద ఏమీ లేవని చెప్పేస్తున్నారు. దీంతో జిపిలో ఫైళ్లు మాయమయ్యాయన్న సమాచారం బయటకు తెలిసి చాలామంది ముందు జాగ్రత్త పడుతున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను బయటకు తీస్తూ, పలానా స్థలం అప్పటి నుంచి మా పేరిట ఉందన్నట్టు దమ్కి లు కూడా ఇస్తున్నారు. వారి వద్ద ఉన్న పత్రాలను బట్టి చూస్తే నిజంగా ఆ స్థలం వారిదే నన్న నమ్మకం కలుగుతుంది.
స్మశాన వాటికకు ఇచ్చిన స్థలం విషయాన్ని మాత్రం సీక్రెట్ గా ఉంచారు. పైగా అదే స్థలంలో వెంచర్ కోసం భూమిని చదును చేస్తున్నారని తెలిసి, బొందల గడ్డలు, అంత్యక్రియలకు వాడుకునే స్థలంలో వెంచర్ ఏర్పాటు చేయడం ఏమిటంటూ లొల్లి పెట్టి పనులు నిలిపి వేయించారు. అసలు పట్టాదారులనుంచి భూమిని కొనుగోలు చేసుకుని, తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని, అవే పత్రాలతో ఇప్పుడు ఎదురు తిరుగుతూ, ఎవరికి భూమి రాసి ఇవ్వలేదంటూ బుకాయిస్తున్నారు. జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఇటువంటి ఇష్యూలు మరిన్ని బయటపడే అవకాశాలు లేక పోలేదని పట్టణంలో చర్చ సాగుతోంది.