Aditya 999 Max.. బాలకృష్ణ లుక్స్ చూస్తే పూనకాలే

by Mahesh |   ( Updated:2024-12-21 16:14:47.0  )
Aditya 999 Max.. బాలకృష్ణ లుక్స్ చూస్తే పూనకాలే
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్(Tollywood)లో సీనియర్ హీరో అయినప్పటికి నేటి తరం యువ హీరోలతో బాలకృష్ణ(Balakrishna) ఎప్పటికి పోటీ పడుతూనే ఉంటారు. ఆయన మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ బాలయ్యకు ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఆయన తీసిన ప్రతి సినిమా మంచి హిట్ గా నిలవడమే కాకుండా.. మంచి కలెక్షన్లను రాబడుతోంది. కాగా ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్(Daku Maharaj) అనే సినిమా పూర్తవ్వగా.. ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ తన అభిమానులకు ఊహించిన విధంగా శుభవార్తను అందించాడు. ఆయన కెరీర్‌లో మంచి హిట్ దక్కించుకున్న ఆదిత్యం 369కి సీక్వెల్ గా.. Aditya 999 Max సినిమాను తీయనున్నట్లు గతంలో ప్రకటించారు. కాగా ఆ సినిమాకు సంబంధించిన లుక్ ను నందబూరి బాలకృష్ణ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఉత్సాహంలో ఊగిపోతున్నారు. ట్విట్టర్ లో బాలయ్య పెట్టిన ఫోటోలలో బాలయ్య హాలీవుడ్ సూపర్ హీరోలా కనిపిస్తున్నాడు. కాగా ఈ పోస్టర్లను బాలయ్య పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినప్పటికి.. సినిమాపై మాత్రం ఎటువంటి అప్ డేట్ వినిపించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే సదరు ట్విట్టర్ అకౌంట్ పై క్లారిటీ రావాల్సి ఉండగా.. సదరు అకౌంట్లో ఉన్న ఫోటోలు నిజమైతే మాత్రం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా మరో సంచలనంగా మారనుందని.. సినీ ప్రేమికులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed