Thandel: అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడింది.. ‘తండేల్’పై అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

by sudharani |
Thandel: అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడింది.. ‘తండేల్’పై అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) కాంబోలో వస్తున్న చిత్రం ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతుంది. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్ని మూవీపై అంచనాలు భారీగా పెంచేశాయి.

అలాగే.. ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగా వన్‌గా నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) అయింది. ఇక సెకండ్ సింగిల్ ‘శివశక్తి’పై కూడా భారీ హైప్ క్రియేట్ చేశారు. అయితే పోస్టర్లతోనే హైప్ క్రియేట్ అయిన ఈ సాంగ్ డిసెంబర్ 22న రిలీజ్ కావాల్సి ఉండగా.. తాజాగా పోస్ట్ పోన్ అయినట్లు ప్రకటించారు చిత్ర బృందం. ఈ మేరకు ‘అనుకోని పరిస్థితుల కారణంగా ‘తాండేల్’ నుంచి రావాల్సిన రెండవ సింగిల్ ‘నమో నమహ శివాయ- శివశక్తి సాంగ్’ విడుదల వాయిదా పడింది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed