- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG GOVT: గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు.. ఎల్లుండి రేవంత్ రెడ్డి చేతులమీదుగా
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. మేనిఫెస్టోలో ‘గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్నారైల సంక్షేమం’ కోసం ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్‌లో మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించబోతున్నది. ఏ కారణంతో మరణించినా వర్తింపజేయనుంది. ఈ మేరకు గత సెప్టెంబర్‌లో జీవో నంబర్ 205 ఇచ్చిన ప్రభుత్వం, ఎల్లుండి ఎక్స్‌గ్రేషియో అందించనున్నది. ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటనలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.85 లక్షలను కేటాయించింది. గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలన్న నిర్ణయంపై టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బీఎం వినోద్ కుమార్, కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారు రెండు వేల మంది గల్ఫ్ కార్మికులు చనిపోయారన్నారు.
పిల్లలకు గురుకులాల్లో సీట్లు..
పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ మృత్యువాత పడుతున్న కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి కుటుంబాలకు స్వాంతన కలిగించనుంది. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన డిసెంబర్ 7, 2023 నాటి నుంచి గల్ఫ్‌లో మరణించినవారి కుటుంబాలకు రూ. 5 లక్ష పరిహారం ఇవ్వనున్నారు. అలాగే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, సవాళ్లు తదితర అంశాలపై అధ్యయనానికి సలహా కమిటీ ఏర్పాటు, ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది.
సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ మృతుల వివరాలు..
1. గంగిపెల్లి తిరుపతి, దుబాయి, యూఏఈ (బూరుగుపల్లి, బోయిన్‌పల్లి)
2. దాసరి బాబు, ఓమన్ (బోయిన్‌పల్లి)
3. కైర నాగయ్య, సౌదీ అరేబియా (చందుర్తి)
4. పోతుగంటి భూమయ్య, సౌదీ అరేబియా (చందుర్తి)
5. బైరి వెంకటేశం, ఇరాక్ (ఓబులాపూర్, ఇల్లంతకుంట)
6. ఏనుగుల భాస్కర్, దుబాయి, యూఏఈ (ఓబులాపూర్, ఇల్లంతకుంట)
7. బోయిని గణేశ్, దుబాయి, యూఏఈ (వంతడుపుల, ఇల్లంతకుంట)
8. కారవాని దేవయ్య, దుబాయి, యూఏఈ (గంభీరావుపేట)
9. ఇకృతి యెల్లం గౌడ్, దుబాయి, యూఏఈ (నిమ్మపెల్లి, కోనరావుపేట)
10. పిట్ల మహేశ్, సౌదీ అరేబియా (వెంకటయ్య కుంట, ముస్తాబాద్)
11. గెరిగంటి అంజయ్య, దుబాయి, యూఏఈ (మల్లారెడ్డిపేట, ముస్తాబాద్)
12. సిలివేరి నాంపెల్లి, ఓమన్ (రామన్నపల్లి, తంగళ్లపల్లి)
13. దురిశెట్టి కొండయ్య, దుబాయి, యూఏఈ (బాలానగర్, వేములవాడ)
14. పెండ్యాల చంద్రకాంత్, దుబాయి, యూఏఈ (నూకలమర్రి, వేములవాడ రూరల్)
15. మాదాసు విజయ్, ఓమన్ (ఆచన్నపల్లి, వేములవాడ రూరల్)
16. పల్లి అంజయ్య, బహ్రెయిన్ (అక్కపల్లి, ఎల్లారెడ్డిపేట)
17. నిమ్మల రాజు, బహ్రెయిన్ (రాచర్ల బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట)