- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కబ్జా కోరల్లో చుంచుపల్లి తండా ఐటిఐ బిల్డింగ్ స్థలం
దిశ, కొత్తగూడెం రూరల్: రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన చదువుల సరస్వతి నిలయం అలంకారప్రాయంగా నిలిచిపోయింది. ఏండ్లు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని కారణంగా ఉండి ఉపయోగం లేకుండా పోతుంది. ప్రస్తుతం ఈ భవనం మందుబాబులకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంతేకాకుండా స్థలం సైతం ఆక్రమణకు దశలవారీగా గురవుతున్నట్లు పలువురు ఆరోపించడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అనుకొని ఉన్న చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండాలో గిరిజనులు విద్యాభివృద్ధిలో రాణించాలనే ఉద్దేశంతో ఐటీఐ భవనంతో పాటు హాస్టల్ బిల్డింగులు నిర్మాణాలు గత పాలకుల హయాంలో జరిగాయి. అయితే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్డింగ్ నిర్మాణానికి కావాల్సిన నిధులను పూర్తిగా విడుదల చేయనందునే నిరుపయోగంగా మిగిలిపోయింది. ఐటీఐ భవనంతో పాటు హాస్టల్ భవనాలకు విద్యుత్ సదుపాయం తో పాటు ప్రహరీ నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ రెండు పనులు పూర్తయితే గిరిజనులకు ఐటిఐ విద్య అందనున్నది. ఐటీఐలో ఎలక్ట్రికల్ ఫిట్టర్ టర్నర్ వెల్డింగ్ తదితర కోర్సులలో ఉంటాయి. ఈ కోర్సులలో విద్యార్థులు విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. అలాంటి భవనం ఏండ్లు గడుస్తున్న పూర్తి కాలేదు.
మందుబాబులకు అడ్డాగా..
నిధుల కొరత కారణంగా చుంచుపల్లి తండాలో ప్రభుత్వ ఐటీఐ ఈ భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదు. గత పాలకులు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయనందున ఐటీఐ భవనం అలంకారప్రాయంగా మిగిలిపోయి మందుబాబులకు అడ్డాగా మారింది. సాయంత్రం సమయంలో నిరుపయోగంగా ఉన్న ఐటిఐ భవనం వద్దకు వెళ్లి మద్యం సేవించి కాళీ సీసాలను అక్కడ వదిలి వెళ్తున్నారు.
ఐటీఐ భవన స్థలం కబ్జా..
చుంచుపల్లి తండాలో ప్రభుత్వ ఐటీఐ భవనం అరకొరగా నిర్మాణం పూర్తి చేసుకోవడంతో ఏండ్ల తరబడి అలంకారప్రాయంగా ఉండటంతో ఐటీఐకి సంబంధించిన ఖాళీ స్థలం దశలవారీగా ఆక్రమణకు గురవుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దాదాపు 5 నుంచి 6 ఎకరాల వరకు ఐటీఐ భవన స్థలం కబ్జా పాలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పరిశీలించి స్వాధీనం చేసుకుంటాం
ప్రభుత్వ ఐటీఐ స్థలం కబ్జాకు గురైనట్లు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సర్వేయర్ దృష్టికి తీసుకువెళ్లి ఎంత కబ్జా అయిందో పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని చెప్పాం. స్థలం ఎంత కబ్జా అయితే అంత స్వాధీనం చేసుకుంటాం.:- తహసీల్దార్ కృష్ణ, చుంచుపల్లి