Accident : అక్కను పండుగకు తీసుకురావడానికి వెళ్తూ..అనంతలోకాలకు

by Aamani |
Accident : అక్కను పండుగకు తీసుకురావడానికి వెళ్తూ..అనంతలోకాలకు
X

దిశ, వేములపల్లి : దీపావళి పండగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్కను పండగకు తీసుకురావడం కోసం వెళుతున్న తమ్ముడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఈ విషాద సంఘటన వేములపల్లి మండలం శెట్టి పాలెం గ్రామంలోని అద్దంకి నార్కెట్ పల్లి రహదారి పై గల హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన గునిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (36) వేములపల్లి మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో ఉంటున్న తన అక్కను పండగకు తీసుకురావడం కోసం మిర్యాలగూడ నుండి వేములపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.

వెనకనుంచి నల్గొండ వైపు వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed