- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NIACL Job Notification: ఎన్ఐఏసీఎల్ లో.. 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ!
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ.. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (New India Assurance Company Limited) దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 170
అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు 71 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ లకు 17 పోస్టులు, ఓబీసీలకు 45, ఎస్సీలకు 25, ఎస్టీలకు 12 పోస్టులు కేటాయించారు.
జనరలిస్ట్స్ లో 120 పోస్టులు: 01-09-2024 నాటికి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీలకు 55 శాతం మార్కులు ఉంటే చాలు)
అకౌంట్స్ లో 50 పోస్టులు: 60 శాతం మార్కులతో ఛార్టర్డ్ అకౌంటెంట్(ఐసీఏఐ)/కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్.(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 55 శాతం. లేదా 60 శాతం మార్కులతో ఎంబీఏ ఫైనాన్స్/పీజీడీఎం ఫైనాన్స్/ఎంకాం. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 55 శాతం)
వయసు: 01-09-2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.100
ఎంపిక: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలతో పాటు ధ్రువ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
ఫేజ్-1 ప్రిలిమినరీ పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లీష్/ హిందీ భాషల్లో 100 మార్కులకు ఉంటుంది.
ఫేజ్-2 మెయిన్ పరీక్ష: ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్కులకు, డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్కులకు ఆన్ లైన్ లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ పూర్తయిన వెంటనే ఆన్ లైన్ లో డిస్క్రిప్టివ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.
ఫేజ్-3 ఇంటర్వ్యూ: మూడవ దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ లకు 75:25 నిష్పత్తిలో వెయిటేజీ ఉంటుంది.
గమనించాల్సినవి: ఒకరు ఒక దరఖాస్తును మాత్రమే పంపాలి. ఎక్కువ పంపితే అన్ని దరఖాస్తులను తిరస్కరిస్తారు.
కాల్ లెటర్ ద్వారా ఇంటర్వ్యూ కేంద్రం, చిరునామా, వేదిక, సమయాలను తెలియజేస్తారు. అయితే వీటిని వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 29-09-2024
ఫేజ్-1 ఆన్ లైన్ పరీక్ష(ఆబ్జెక్టివ్): 13-10-2024
ఫేజ్-2 ఆన్ లైన్ పరీక్ష(ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్): 17-11-2024
వెబ్ సైట్: www.newindia.co.in/