- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SBI PO Recruitment: బ్యాంక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 600 పీఓ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల..!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇటీవలే 13,735 క్లర్క్(Clerk) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎస్‌బీఐ తాజాగా ప్రొబేషనరీ ఆఫీసర్ల(PO) నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 600 పీఓ పోస్టులను భర్తీ చేయనున్నారు. అసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/web/careers/current-openings ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 జనవరి 2025. మే/ జూన్ లో తుది ఫలితాలను విడుదల చేస్తారు.
పోస్టులు, ఖాళీలు:
ప్రొబేషనరీ ఆఫీసర్(PO) - 600
విద్యార్హత:
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
వయోపరిమితి:
1 ఏప్రిల్ 2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ. 750 ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీ వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు జీతం ఉంటుంది.
- Tags
- SBI
- PO
- Recruitment