Manmohan Funeral: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-27 16:59:02.0  )
Manmohan Funeral: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) అత్యక్రియల వేళ స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(Central Govt) నిగమ్‌బోధ్ ఘాట్‌(Nigambodh Ghat)లో చేస్తోన్న ఏర్పాట్లపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీర్ భూమి లేదా? శక్తి స్థల్‌లో కొంత భాగం కేటాయించాలని ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సూచించారు. అక్కడే మన్మోహన్ సింగ్ సమాధి నిర్మించాలని కాంగ్రెస్(Congress) నేతలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనల తర్వాత కూడా కేంద్రం నిర్ణయం మార్చుకోకపోవడంతో కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. మన్మోహన్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, మన్మోహన్‌ సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

Advertisement

Next Story

Most Viewed