గుర్తుతెలియని వ్యక్తి మృతి

by Naveena |
గుర్తుతెలియని వ్యక్తి మృతి
X

దిశ, చైతన్యపురి : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణపల్లి నుండి తుర్కయంజాల్ రోడ్డుమధ్యలో రోడ్డు పక్కన మృతదేహం పడి ఉందని సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం సమయంలో 100 డయల్ రావడంతో హెడ్ కానిస్టేబుల్ పి. రాజు సిబ్బంది కలిసి సంఘటన స్థలనికి వెళ్లి చూసారు. మృతదేహం సర్వే నెంబర్ 263 వ్యవసాయ భూమి పక్కన ఉన్నట్లు గుర్తించి సదరు భూమి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొంతం నరసింహారెడ్డి వ్యవసాయ భూమిగా నిర్దారించారు. మృతదేహాన్ని పరిశీలించి చూడగా వ్యవసాయ పొలానికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తీగ దగ్గర కింద పడిపోయి చనిపోయినట్లుగా ఉన్నాడని మృతదేహం ఆచూకీ కోసం విచారించగా ఎవరు గుర్తించలేదని సిఐ తెలిపారు. మృతుదు 60 ఏండ్లు ఉంటుందని , ఎత్తు 5.5 ఫీట్లు, చామనఛాయ రంగు కలిగి, తెలుపు రంగు చొక్కా , తెలుపు ఎరుపు రంగు గీతల టవలు కలిగి ఉన్నాడని ఎవరైనా గుర్తుపడితే తమను సంప్రదించాలని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed