- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ACB & ED: మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు..! ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో మరో కీలక పరిణామం
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసింగ్ కేసు (Formula E-Racing Case)లో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు ఉచ్చు బిగిస్తోంది. ఈ మేరకు కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన పూర్తి డేటాను తాజాగా ఏసీబీ, ఈడీ అధికారులకు అందజేసినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ (Finance Department) రికార్డుai, హెచ్ఎండీఏ (HMDA) లావాదేవీలు, ఫార్ములా ఈ-రేసుకు సంబంధించి ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీలను ఏసీబీ అధికారులు ఈడీకి హ్యాండోవర్ చేశారు. అయితే, ఇప్పటికే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఏసీబీ (ACB) తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో కౌంటర్ పిటిషన్ (Counter Petition) దాఖలు చేసింది.
కేసులో నిందితులు ప్రభుత్వ నిధుల దుర్వియోగం, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారంటూ అధికారులు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా క్యాబినెట్ అప్రువల్, ఆర్థిక శాఖ (Finance Department) అనుమతి లేకుండానే విదేశీ సంస్థ (Foreign Company)కు రూ.55 కోట్లు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అధికారులపై కేటీఆర్ (KTR) ఒత్తిడి తీసుకొచ్చి.. స్వతంత్ర సంస్థ అయిన హెచ్ఎండీఏ (HMDA)కు రూ.8 కోట్లు అదనపు భారం పడేలా చేశారని ఏసీబీ (ACB) అధికారులు కోర్టుకు విన్నవించారు. తనపై పెట్టిన ఎఫ్‌ఐఆర్ (FIR)లను క్వాష్ చేయాలని కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదంటూ తాజాగా ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.