- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: ఢిల్లీలో వర్షం.. వందేళ్ల తర్వాత డిసెంబర్ నెలలో ఇదే అత్యధికం
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లో వర్షం(Rain) సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏకంగా 101 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డిసెంబర్ నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం నమోదంది. శనివారం ఉదయం 8.30 వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 41.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 101 ఏళ్ల క్రితం 1923 డిసెంబర్ 3న 75.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంతటి వర్షం తర్వాత మళ్లీ డిసెంబర్(December)లో శనివారమే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇకపోతే, ఢిల్లీలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 13డిగ్రీలకు పడిపోయాయి. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచి పలుచోట్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.భారీ వర్షం కారణంగా రాజధాని నగరంలో క్షీణించిన వాయునాణ్యత ఒక్కసారిగా మెరుగుపడింది.
జమ్ములో పొగమంచు
ఇకపోతే, జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో భారీగా మంచు (Snowfall) కురుస్తోంది. శుక్రవారం నుంచి విపరీతంగా మంచు కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ లో రవాణాసర్వీసులకు అంతరాయం కలిగింది. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి, మొఘల్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్ల శ్రీనగర్ విమానాశ్రయం నుంచి సర్వీసులు నిలిపివేశామన్నారు. రైల్వే ట్రాక్‌లపై భారీగా మంచు పేరుకుపోవడంతో బనిహాల్-బారాముల్లాల మధ్య పలు రైళ్లను రద్దు చేశామని అధికారులు పేర్కొన్నారు. విపరీతమైన మంచు వల్ల శ్రీనగర్-జమ్మూ జాతీయరహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని, దాదాపు 2,000 వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ.. “నేను ఈరోజు జమ్మూ నుంచి శ్రీనగర్‌కి వెళ్లాను. బనిహాల్ నుంచి శ్రీనగర్ వరకు మంచు తెరిపివ్వకుండా కురుస్తూనే ఉంది. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఖాజిగుండ్ వద్ద దాదాపు 2,000 వాహనాలు మంచులో కూరుకుపోయాయి. ముందుగా భారీ వాహనాలను తరలించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కశ్మీర్ యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ పేర్కొంది.