AP Deputy CM:‘ఏంటయ్యా మీరు?’.. ఫ్యాన్స్ పై పవన్ కళ్యాణ్ అసహనం!

by Jakkula Mamatha |
AP Deputy CM:‘ఏంటయ్యా మీరు?’.. ఫ్యాన్స్ పై పవన్ కళ్యాణ్ అసహనం!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇవాళ(శనివారం) పార్వతీపురం మన్యం జిల్లాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తోన్నారు. ఇదిలా ఉంటే.. నిన్న(శుక్రవారం) వైసీపీ నేతల(YCP Leader) దాడిలో గాయపడి కడప(Kadapa) రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో(MPDO) జవహర్‌బాబును ఆయన పరామర్శించారు. కడప పర్యటనలో ఎంపీడీవోను పరామర్శించి మీడియాతో మాట్లాడుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఊహించని పరిణామం ఎదురైంది. సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు ‘‘ఓజీ.. ఓజీ.. ’’అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ‘ఏంటయ్యా మీరు.. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు.. పక్కకు రండి’ అని అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న OG మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

Next Story

Most Viewed