New Year : న్యూ ఇయర్‌‌ సెలబ్రేషన్స్.. మన దేశంలో ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామో తెలుసా?

by Javid Pasha |
New Year : న్యూ ఇయర్‌‌ సెలబ్రేషన్స్.. మన దేశంలో ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరికీ ఎన్నో అనుభవాలను, జ్ఞాపకాలను అందించిన ఈ సంవత్సరం (2024) ఇక మనకు గుడ్ బై చెప్పేందుకు రెడీగా ఉంది. ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూసే కొత్త సంవత్సరం (2025) మరో రెండు రోజుల్లో మనల్ని పలకరించనుంది. ఈ నేపథ్యంలో యువత ఫుల్ జోష్ మీద ఉంది. తమదైన పద్ధతిలో న్యూ ఇయర్‌కు వెల్కం చెప్పేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31ను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో దాదాపు ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. ఇదంతా పక్కన పెడితే ప్రతీ సంవత్సరం న్యూ ఇయర్‌ను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? మన దేశంలో ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి మొదలయ్యింది అనే సందేహాలు కూడా పలువురు పలువరు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కాగా నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.

నిజానికి భారత దేశంలో బ్రిటీష్ పాలనకంటే ముందు ఇప్పటి మాదిరి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునే వారు కాదట. అప్పట్లో ఎక్కువగా సంప్రదాయ వేడుకలు, పండుగలు మాత్రమే జరుపుకునే వారు. ఇక న్యూ ఇయర్ విషయానికి మార్చి లేదా ఏప్రిల్ మాసంలో వచ్చే చైత్రమాసాన్ని అత్యధికమంది కొత్త సంవత్సరంగా భావించేవారని నిపుణులు చెబుతున్నారు. ఇక తెలుగు, కన్నడ ప్రజలైతే ఉగాది పండుగనే కొత్త సంవత్సరంగా జరుపుకునేవారని చెప్తారు. మరాఠి ప్రజలు గుడి పడ్వాను, తమిళ ప్రజలు పుతాండు పండుగను కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకునేవారని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో వీటిని కొత్త సంవత్సరంగా ఎవరూ భావించడం లేదు. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ప్రస్తుతం జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్‌గా భావిస్తారు.

చైత్ర మాసాన్ని కొత్త సంవత్సరంగా భావించే మన దేశ ప్రజలు బ్రిటీష్ పాలన సమయంలో ప్రపంచమంతా ఫాలో అయ్యే గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరించాల్సి వచ్చింది. అందులో భాగంగా న్యూ ఇయర్‌ను కూడా ఒక వేడుకగా జనవరి ఫస్టునే జరుపుకోవడం ప్రారంభించారు. తర్వాత బ్రిటీష్ పాలన నుంచి విముక్తి లభించినప్పటికీ అంతర్జాతీయ నిబంధనల్లో భాగంగా భారతీయులు కూడా గ్రెగోరియన్ క్యాలెండర్‌ను కంటిన్యూ చేయాల్సి వచ్చిందని నిపుణులు చెబుతారు. అంతేకాకుండా 1947లో జనవరి1వ తేదీని కొత్త సంవత్సరం ప్రారంభంగా భారత ప్రభుత్వం కూడా గుర్తించి అఫీషియల్‌గా డిక్లేర్ చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం జనవరి మొదటి తేదీనే మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాం.

Advertisement

Next Story