Rohit sharma : రోహిత్ రిట్మైర్మెంట్ రూమర్స్‌.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |
Rohit sharma :  రోహిత్ రిట్మైర్మెంట్ రూమర్స్‌.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..!
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్‌లో ప్రదర్శన కారణంగా రోహిత్ రిటైర్మెంట్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఈ రూమర్స్‌ను శుక్రవారం బీసీసీఐ ఖండించింది. ‘రోహిత్‌తో రిటైర్మెంట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. అవన్నీ నిరాధరమైన పుకార్లు మాత్రమే. ఇలాంటి రూమర్స్ వినడం కొత్తకాదు. రోహిత్ కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వీడ్కోలు గురించి ఆయనే నిర్ణయం తీసుకుంటాడు. రోహిత్ నుంచి తమకు రిట్మెర్మెంట్‌పై ఎలాంటి సమాచారం లేదు. నాలుగో టెస్ట్ మ్యాచ్ నడుస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలవడంపైనే మా దృష్టి ఉంది.’ అని బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాతో తెలిపాడు. ‘ప్రతి జట్టుకు మార్పులు చేయడంలో ప్లాన్స్ ఉంటాయి. ఇదేమీ కొత్త కాదు. రోహిత్ రిటైర్ కావాలని ఎవరూ ఒత్తిడి చేయరు. భారత జట్టుకు అతను టీ20 వరల్డ్ కప్ అందిచాడు. చాంపియన్స్ ట్రోఫీ రాబోతుంది. రిట్మైర్మెంట్ అనేది ఆటగాళ్ల నిర్ణయం.’ అని అధికారి స్పష్టం చేశాడు.

Next Story

Most Viewed