తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు ఒకే

by Mahesh |
తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు ఒకే
X

దిశ, తెలంగాణ బ్యూరో: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకున్నది. సోమవారం నుంచి గురువారం వరకు వారానికి రెండు రోజుల పాటు ఈ లేఖలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ నిర్ణయాన్ని టీటీడీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ప్రకటించనున్నట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్రంగా విడిపోయాక 2019 వరకు తెలంగాణ ప్రజాప్రతినిధులను లేఖలను పరిగణనలోకి తీసుకున్న టీటీడీ ఆ తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవడం మానేసింది. దీనిపై తీవ్రమైన విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దశాబ్ద కాలం క్రితం వరకు ఉమ్మడి ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఇక్కడి ప్రజాప్రతినిధుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఖలను ఆమోదించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని, టీటీడీని తెలంగాణ ప్రజా ప్రతినిధులు కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు సానుకూల నిర్ణయం తీసుకున్నది.

Advertisement

Next Story

Most Viewed