Bhu Bharati : జనవరి 1 నుంచి ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్

by Y. Venkata Narasimha Reddy |
Bhu Bharati : జనవరి 1 నుంచి ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి(Bhu Bharati) నూతన ఆర్వోఆర్ చట్టం 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ధరణి(Dharani)పోర్టల్ బాధ్యతలు చూస్తున్న టెర్రాసిస్ గడువు డిసెంబర్ 31 వ తేదీతో ముగిసిపోనుండగా ధరణి పోర్టల్ కు కాలం చెల్లిపోనుంది. దీంతో భూభారతి పోర్టల్ ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్( NIC) పూర్తి స్థాయిలో నిర్వహించనుంది. ధరణి పోర్టల్ పూర్తి వివరాలను ఎన్ ఐకి కి టెర్రాసిస్ బదిలీ చేయనుంది. ఈ తతంగం పూర్తి కాగానే భూ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా ధరణి ఆసరాతో కొల్లగొట్టిన భూముల లెక్కలు తేల్చాలని ప్రభుత్వం భావిస్తుంది.

ధరణి భూ కుంభకోణాల్లో ప్రభుత్వ పెద్దల పాత్రతోపాటు రెవెన్యూ కీలక అధికారుల పాత్రను గుర్తించనున్నారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ధరణి ముసుగులో సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టుగా..ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15వేల ఎకరాలను మాయం చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్‌లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.



Next Story