‘ప్రపంచంలోనే అతను బెస్ట్’.. రామ్ చరణ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
‘ప్రపంచంలోనే అతను బెస్ట్’.. రామ్ చరణ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: అలనాటి హీరోయిన్ జెనీలియా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘బాయ్స్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. దీంతో ఈ భామకు వరుస ఈ ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ వంటి భాషా చిత్రాల్లో కూడా నటించింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్న టైంలో బాలీవుడ్ అగ్రనటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీకి ప్రజెంట్ ఇద్దరు కొడుకులు.

ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా తన భర్తపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య గొడవలు ఎప్పుడూ జరగలేదు. మానసికంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేం ఇద్దరం మాట్లాడుకొని అర్థం చేసుకుంటాం. నేను, రితేష్ సహనంగానే ఉంటాము. ప్రతీదానికి ఓ ఓవర్‌గా థింక్ చేయము. అదే మా జీవితం ఇలా సాగడానికి కారణం. నా భర్త ప్రపంచంలోనే అత్యుత్తమ భర్త’ అని జెనీలియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story