- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అహంకారం తగ్గిస్తాం.. వదలిపెట్టం: వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నాయకుల(Ycp Leaders) అహంకారం తగ్గిస్తామని, ఎవరినీ వదిలిపెట్టమని వైసీపీ నాయకులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Deputy Cm Pawan Kalyan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబు(Galiveedu MPDO Jawahar Babu)ను కడప రిమ్స్(Kadapa rims)లో పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. జవహర్ బాబుపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులు అహంకారంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం మాదిరి కాదని ఎవరు రెచ్చిపోయిన చూస్తూ ఊరుకోమని పవన్ హెచ్చరించారు.
జవహర్ బాబుపై దాడిని కలెక్టర్, ఎస్పీకి కంప్లైట్ చేశామని పవన్ చెప్పారు. ఎంపీపీ కార్యాలయంలో గడిపెట్టి మరి జవహర్ బాబుపై దాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అహంకారాన్ని అణచివేస్తామన్నారు. ఆధిపత్యపు అహంకారంతో అధికారులపై దాడుల చేస్తే అటువంటి వాళ్లను వదిలిపెట్టమన్నారు. కచ్చితంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. 11 సీట్లు వచ్చినా ఇంకా గాల్లో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారులపై దాడి చేసినా, విధులను అడ్డుకున్నా కఠిన చర్యలు తప్పవని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఆధిపత్య ధోరణితో దాడులు చేస్తే ఊపేక్షించమని వార్నింగ్ ఇచ్చారు. దాడి ఘటనలో పారిపోయిన వాళ్లను కూడా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.