ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శివకుమార్..

by Sumithra |
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శివకుమార్..
X

దిశ, జడ్చర్ల : 2025 సంబంధించి ఏబీవీపీ నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జడ్చర్లకు చెందిన శివకుమార్ ను ఎంపిక చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి ప్రకటించారు. సిద్దిపేటలో జరిగిన ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్లో విద్యారంగ సామాజిక సమస్యల పై అనేక తీర్మానాలు చేపట్టామని అన్నారు. అందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలానికి చెందిన శివకుమార్ జడ్చర్ల పట్టణంతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో ఏబీవీపీ పక్షాన విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న తీరును, విద్యార్థుల పక్షాన చేపడుతున్న ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎంపికైన శివకుమార్ మాట్లాడుతూ తనను నమ్మి రాష్ట్ర శాఖలో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్న రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలిపారు. అనునిత్యం విద్యారంగ సమస్యల పై పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఏబీవీపీ శాఖ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తానని అన్నారు. తనకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కడానికి కారణమైన జడ్చర్ల మహబూబ్ నగర్ ఏబీవీపీ కార్యవర్గానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జడ్చర్ల పట్టణానికి చెందిన శివకుమార్ కు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక అవ్వడం పట్ల జడ్చర్ల ఏబీవీపీ శాఖ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed