- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మిస్సింగ్
దిశ, శేరిలింగంపల్లి : రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు కనబడకుండా పోయిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ న్యూ కాలనీలో నివాసం ఉండే సంగీత, రాములు (24) దంపతులు. వీరిద్దరు దినసరి కూలీలు గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈనెల 14న తన భార్య అయిన సంగీతను డబ్బులు ఇవ్వాలని రాములు ఒత్తిడి చేశాడు. ఆమె డబ్బులు ఇవ్వక పోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాములు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. గతంలోనూ తనతో డబ్బుల విషయంలో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగు రోజుల్లో తిరిగి వచ్చారని, ఈసారి మాత్రం 13 రోజులు గడిచినా రాములు ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అతని భార్య సంగీత పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో వృద్ధుడు మిస్సింగ్
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన రామాయి సాయిలు(50) అతని కుటుంబంతో కలిసి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి సొంత గ్రామంలో ఇంటి నిర్మాణం చేపడుతుండడంతో మిగతా కుటుంబ సభ్యులు గ్రామానికి వెళ్లగా.. సాయిలు మాత్రం ఇక్కడే ఉండి దినసరి కూలీగా వెళ్తున్నాడు. అయితే రెండు మూడు రోజులుగా పనిలేదని తన కుమార్తె శాంతకి ఫోన్ చేసి చెప్పాడు. ఖర్చులకు కూడా డబ్బులు లేవని, డబ్బులు పంపించాలని కోరాడు. అయితే అతని కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేయమని చెప్పారు. సరే వస్తానని చెప్పిన సాయిలు ఈనెల 24వ తేదీన లక్ష్మీనగర్ లోని తన ఇంటి నుండి బయటకు వెళ్లాడని ఇప్పటి వరకు రాలేదని చుట్టుపక్కల వారు సాయిలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. వారు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఆరా తీసిన సాయిలు ఆచూకీ తెలియలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.