కడప రిమ్స్‌కు పవన్ కల్యాణ్.. గాలివీడు ఎంపీడీవోకు పరామర్శ

by srinivas |   ( Updated:2024-12-28 07:47:16.0  )
కడప రిమ్స్‌కు పవన్ కల్యాణ్.. గాలివీడు ఎంపీడీవోకు పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కడప రిమ్స్‌(Kadapa Rims)కు వెళ్లారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబు(Galiveedu MPDO Jawahar Babu)ను ఆయన పరామర్శించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో అప్యాయంగా మాట్లాడారు. అలాగే జవహర్ బాబుకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దాడి ఘటనను మర్చిపోవాలని, తామంతా అండగా ఉంటామని జవహర్ బాబుకు ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని విధులకు హాజరుకావాలని పవన్ కల్యాణ్ సూచించారు.

అనంతరం అన్నమయ్య జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం అన్నమయ్య జిల్లాలో ఒక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు.

కాగా ఎంపీపీ కార్యాలయం తాళం విషయంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయి గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఎంపీపీ కార్యాలయం తాళం ఇతరులకు ఇవ్వొద్దనందునే తనపై దాడి చేశారని రాయచోటి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 13 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారించారు.

Advertisement

Next Story

Most Viewed