- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా అయ్యప్ప మండల పడిపూజ మహోత్సవం..
దిశ, మందమర్రి : మందమర్రిలోని శ్రీ హరిహర దేవస్థానంలో అయ్యప్ప స్వామి మహా మండల పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి వారికి విశేష అభిషేకములు, శ్రీ అభయ ఆంజనేయ స్వామికి అభిషేకం అనంతరం శ్రీ సంతోషి మాత అమ్మవారి చీరల వేలం నిర్వహించారు.
సాయంత్రం మహా మండల పడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం మహా హారతి, పవళింపు సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం దాత అంజనీ పుత్ర మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి-స్రవంతి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి వల్స సదానందం, అర్చకులు చిమిరాల దామోదరచార్యులు, మాదిరాజు శరత్ శర్మ, మాదిరాజు మధు శర్మ, అయ్యప్ప మాల ధారణ స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.