- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
దిశ, వెబ్ డెస్క్: నిషేదిత డ్రగ్స్(Drugs) అక్రమ రవాణపై ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లింగ్(Smuggling) మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు దేశంలో ఏదో ఒక విమానాశ్రయంలో డ్రగ్స్, కొకైన్, ఇతర స్మగ్లింగ్ వస్తువులు పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో వేర్వేరు ఘటనల్లో రూ. 18 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. మొదట ఓ స్మగ్లర్ నుంచి రూ.10.14 కోట్ల విలువైన 676 గ్రాముల కొకైన్ సీజ్ చేయగా.. కొద్ది గంటల తర్వాత మరో స్మగ్లర్ దగ్గర రూ.8 కోట్ల విలువైన కొకైన్ దొరికింది. దీంతో మొత్తం కొకైన్ ను సీజ్ చేసిన అధికారులు.. నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అయితే మరో మూడు రోజుల్లో న్యూయర్ సెలబ్రేషన్స్ ఉండటంతో.. ఈ డ్రగ్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇందుకోసం స్మగ్లర్లు శతవిధాలుగా ప్రయత్నించి డ్రగ్స్ ను స్మగ్లింగ్(Smuggling) చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.