- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీర్పూర్ దోపిడీ కేసులో మరో నిందితుడి అరెస్ట్
దిశ, బీర్పూర్ : జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో సంచలనం సృష్టించిన దొంగతనం కేసులో పరారీలో ఉన్న మరొక నిందితుడిని అరెస్టు చేసినట్లు జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, బీర్పూర్ ఎస్సై కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. బీర్పూర్ గ్రామానికి చెందిన కిరాణా షాప్ నిర్వహిస్తున్న కాసం ఈశ్వరయ్య ఇంట్లో ఈనెల 14వ కొందరు దుండగులు దొంగతనం చేసి పరారయ్యారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇదే నెల 20వ తేదీన ఆరుగురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక ఈ దొంగతనంతో సంబంధం ఉన్న మంచిర్యాలకు చెందిన ముకునూరి కిరణ్ కుమార్ కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడి నుండి బంగారు నగలు, నేరం చేయడానికి ఉపయోగించిన స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనపరుచుకొని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.