RBI: ఆర్బీఐలో భారీగా పెరిగిన బంగారం నిల్వలు

by Maddikunta Saikiran |
RBI: ఆర్బీఐలో భారీగా పెరిగిన బంగారం నిల్వలు
X

దిశ, వెబ్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజాగా హాఫ్ ఇయర్ నివేదికను వెల్లడించింది. ఇందులో బంగారం నిల్వలు(Gold Reserves) భారీగా పెరిగినట్లు పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(BOE) నుంచి 102 మెట్రిక్‌ టన్నుల పసిడిని ఆర్బీఐకి బదిలీ చేసుకున్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మేలో బ్రిటన్(Britan) నుంచి 100 టన్నుల గోల్డ్ ను ఆర్బీఐ ఇంపోర్ట్ చేసుకుంది. ఇక సెప్టెంబర్ 30 నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 855 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇందులో స్వదేశంలో 510.5, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (BIS) వద్ద 324 మెట్రిక్ టన్నుల గోల్డ్ ఉంది. మరో 20.26 టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఉందని ఆర్బీఐ తెలిపింది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ వద్ద 822.10 టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయని తాజా నివేదికలో తెలిపింది. అయితే పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా ఆర్బీఐ విదేశాలలో నిల్వ ఉంచిన గోల్డ్(GOLD)ను ఇండియాకు దిగుమతి చేసుకుంటోంది. దీంతో బంగారం సేఫ్(SAFE)గా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా సెప్టెంబర్ 2022 నుంచి 214 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ ఇండియాకు తిరిగి తీసుకువచ్చింది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsapp channel
👉 Follow us on Share chat

Next Story