- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బంపరాఫర్.. అక్కడ ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్.. యాపిల్ ఫోన్లు

దిశ,ధర్మారం : ఆ పెట్రోల్ బంక్లో జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. తనకు పెట్రోల్ ఎందుకు పోయలేదని యజమానులతో గొడవకు దిగారు. ఎందుకంటే అక్కడ ఒక్క రూపాయికి లీటర్ పెట్రోల్ పోశారు. ఇది నిజమేనా అంటే.. అవును అక్షరాలా నిజమే. ఆ కథేంటో తెలుసుకోండి మరి.. ధర్మారం మండల కేంద్రంలోని ట్విన్స్ భారత్ పెట్రోల్ బంకులో వేములవాడతో పాటు కరీంనగర్ కు చెందిన కొంత మంది యువకులు పెట్టిన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక్క రూపాయికి లీటర్ పెట్రోల్ ఆఫర్ ను పెట్టారు. కేవలం వందమందికి ఒక్కో లీటర్ ఆఫర్ ను ఇస్తూ వంద లీటర్ల పెట్రోల్ ను బైకులో పోయించారు. పెట్రోల్ తోపాటు తమ ఛానల్ ను సబ్స్క్రేబ్ చేసుకున్న వారికి రెండు ఆపిల్ ఫోన్ల ఆఫర్ ను కూడా ప్రకటించారు. మొదట తమ ఛానల్ను సబ్స్క్రేబ్ చేసుకున్న వంద మంది బంకులో లీటర్ పెట్రోల్ పోసుకొని తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తమ యూట్యూబ్ ఛానల్ లక్ష సబ్స్క్రేబ్స్ దాటిన తర్వాత తీసే డ్రాలో గెలుపొందిన వారికి ఆపిల్ మొబైల్స్ ఇస్తామన్నారు. కాగా రూపాయికి లీటర్ పెట్రోల్ అనే విషయం ఈనోటా ఆ నోటా అందరికీ తెలియడంతో ద్విచక్ర వాహనదారులు బంకుకు పోటెత్తారు. వంద మందికి పెట్రోల్ పోసిన తరువాత మిగతా వారు తమకు ఎందుకు పోయరని అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దాంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీంతో బంకు యాజమాన్యం నచ్చజెప్పడంతో వాహనదారులు శాంతించారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ నిర్వాకులు శశి మాట్లాడుతూ తాము రెండు నెలల క్రితం శశిహస్లర్ అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించినట్లు చెప్పారు. తమ యూట్యూబ్ ఛానల్ లో మొదటి లాంగ్ వీడియోను పెట్టిన సందర్భంగా వంద మందికి రూపాయికి లీటర్ పెట్రోల్ ను పోయించినట్లు తెలిపారు. తమ ఛానల్ లక్ష సబ్స్క్రేబర్లను పూర్తి చేసుకున్న తర్వాత డ్రా నిర్వహించి పెట్రోల్ పోసుకున్న వంద మందిలో ఇద్దరికి రెండు ఆపిల్ ఫోన్లను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.