వీళ్లు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

by Naveena |
వీళ్లు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 13: ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర వాటితో ముడిపడిన అంశాల గురించి చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఈఆర్ఓలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతో పాటు ఈఆర్ఓలు తమ తమ స్థాయిలలో పొలిటికల్ పార్టీ మీటింగ్ లు ఏర్పాటు చేసి అప్ డేట్స్ అందించాలన్నారు. సమావేశాల తేదీ, సమయాన్ని ఖరారు చేస్తూ ముందస్తుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలన్నారు.

సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, సమావేశాల వివరాలను సీఈఓ కార్యాలయానికి, గుర్తింపు పొందిన పార్టీల ప్రధాన కార్యాలయాలకు కూడా పంపించాలని సూచించారు. కాగా, ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటది వెంట పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని సీఈఓ సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story