- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL 2025 : ఐపీఎల్ ను నిషేధించండి : పాక్ మాజీ కెప్టెన్

దిశ, వెబ్ డెస్క్ : చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో జరిగిన అవమానంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్(Pakistan Former Captain) ఇంజమామ్ ఉల్ హక్ తీవ్ర(Inzamam Ul Hak) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌ను బహిష్కరించాలంటూ(IPL Boycott) పలు దేశాల క్రికెట్ బోర్డులకు విజ్ఞప్తి చేశాడు. బీసీసీఐ(BCCI) తమ ఆటగాళ్లను విదేశీ టీ20 లీగ్‌లో ఆడేందుకు అనుమతించడం లేదని.. ఆయా బోర్డులు సైతం అదే వైఖరిని అవలంభింస్తూ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వొద్దని ఇంజమామ్ పేర్కొన్నారు. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్‌తో సహా చాలా మంది భారతీయ మహిళా క్రికెటర్లు బీబీఎల్, డబ్ల్యూసీపీఎల్, ది హండ్రెడ్ వంటి విదేశీ లీగ్‌లలో ఆడుతున్నారు.
కానీ మెన్స్ ప్లేయర్స్ ఐపీఎల్ తప్పా మరే ఇతర లీగ్స్‌లో ఆడడం లేదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర లీగ్‌లలో ఆటగాళ్లు ఆడకుండా బీసీసీఐ నిషేధించిందని మండిపడ్డారు. మిగతా అన్ని బోర్డులు తమ ఆటగాళ్లను ఐపీఎల్‌కు పంపడం మానుకోవాలన, బీసీసీఐలాగే ఇతర బోర్డులు అలాగే చేయకూడదా అంటూ ఇంజమామ్ ప్రశ్నించాడు. అయితే భారత క్రికెటర్లకు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాతే విదేశీ లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఉంది.