- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth Reddy : ముగిసిన సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్(JaiShankar) తో భేటీ అయ్యేందుకు బుధవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. గురువారం వీరు ఇరువురు సమావేశం అయ్యి కీలక విషయాలు చర్చించారు. ఈసందర్భంగా 2025లో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్(Miss World), గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్‌తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే "ఇండియా జాయ్"(India Joy) వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా "తెలంగాణ రైజింగ్"(Telangana Raising)ను ప్రోత్సహించేందుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి జైశంకర్‌ను సీఎం కోరారు. తెలంగాణ రైజింగ్‌ను విదేశాల్లో భారత్ కార్యక్రమాల్లోనూ ప్రచారం చేయాలని, దౌత్య, లాజిస్టిక్ సహాయంతో హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాగా ఈ సమావేశంలో మరో కీలకాంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) విషయం చర్చించారు. విదేశాల్లో ఉన్న ఫోన్ట్యాపింగ్నిందితులను ఇక్కడికి తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని కోరినట్లుగా సమాచారం. తమ రాష్ట్రంలో ఫోన్‌ట్యాపింగ్ కేసు నమోదయినప్పటి నుంచి వారిని ఇక్కడికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తు చేశారు. రెడ్ కార్నర్నోటిసులు జారీ చేశామని, ఇంటర్పోల్సాయం తదితర వాటి ద్వారా ప్రయత్నించామన్నారు. అయినా అటు వైపు నుంచి స్పందన లేకపోవడంతో కేంద్రం మరింత ఒత్తిడి తీసుకవచ్చి మన దేశ చట్టాలకు అనుగుణంగా ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలని కోరినట్లుగా సమాచారం. సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితం తిరగి హైదరాబాద్ బయల్దేరారు.