- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చాలెంజ్ చేసిన ఆ తొడలను బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: అన్ని ఒక్కడినే అయి 2014లో జనసేన(Janasena)ను స్థాపించానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. జనసేన 12 ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ‘‘2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం.. నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. మనం ఒడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు. జబ్బలు చరిచారు. కొడలు కొట్టారు. మన ఆడపడుచులను అవమానించారు. ప్రజలను నిరంతరం హింసించారు. ఇందేం న్యాయమని అడిగితే జనసైనికులపై కేసులు పెట్టారు. జైళ్లల్లోకి పంపారు.’’ అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపారు. నాపై చేయని కుట్రలేదు. కుంతత్రాలు లేవు. ఎన్నికల్లో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని హేళన చేశారు. మనం రికార్డులను బద్దలు కొట్టాం. చాలెంజ్ చేసిన ఆ తొడలను బద్దలు కొట్టాం. ఏపీ అసెంబ్లీలో 21 ఎమ్మెల్యేలు, రెండు పార్లమెంట్ ఎంపీలతో అడుగుపెట్టాం. దేశమంతా తలతిప్పి చూసేలా 100 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం. ఎన్డీయే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం.’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
READ MORE ...
‘తనతో సినిమా చేస్తా అని అడిగా.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?’.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు