- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మద్యానికి బానిసై ప్రాణం తీసుకున్నాడు..
by Sridhar Babu |

X
దిశ, బెజ్జూర్ : మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జూరు మండల కేంద్రంలో గురువారం జరిగింది. బెజ్జూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బెజ్జూర్ గ్రామానికి చెందిన కావిడే లక్ష్మయ్య (64) అనే వృద్ధుడు మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మయ్యను కుటుంబీకులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యతో పాటు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య కమలాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story