‘మీకు కేసీఆర్ ఇదే నేర్పించారా’?.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై DCM భట్టి సీరియస్

by Gantepaka Srikanth |
‘మీకు కేసీఆర్ ఇదే నేర్పించారా’?.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై DCM భట్టి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌(Gaddam Prasad Kumar)పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధాకరం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. జగదీష్ రెడ్డి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసి వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. నిండు శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చులకనగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. "మా అందరి తరపున మీరు పెద్ద మనిషిగా మాత్రమే కూర్చున్నారే తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు" అని స్పీకర్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చులకనగా మాట్లాడటం చూస్తే వారు మిమ్మల్ని సభాపతిగా చూడటం లేదన్నారు.

శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ(BRS LP) సమావేశం నిర్వహించి కేసీఆర్(KCR) మీకు ఇదే నేర్పించారా? అని ప్రశ్నించారు. మీ సంస్కారం చూస్తుంటే బాధగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టుగా చేసిన వ్యాఖ్యలను సభలో సభ్యులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. సభ సాంప్రదాయాలు కాపాడటానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ప్రకారం శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కొంతమంది సభ్యులు కోరారు. మాకు ప్రజాస్వామ్యం, సభ సాంప్రదాయంపై గౌరవం ఉంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed