- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలు : ఎమ్మెల్సీ కోదండరాం

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు గురువారం టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీ ఆధ్వర్యంలో నాంపల్లి గృహకల్ప లోని కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లీం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఫహీముద్దీన్ ఖురేషి, టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ , టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు, మహిళ ఉద్యోగులు, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు, పలు యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందుకు విచ్చేసిన అతిథులు, ఉద్యోగులు, సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఉద్యోగులకు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తాను ప్రభుత్వ సర్వీసులో ఉన్నంతకాలం ఇదే ఆనవాయితీని కొనసాగిస్తానని అన్నారు.