- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RRB టెక్నీషియన్ ఫలితాలు విడుదల

దిశ,వెబ్‌డెస్క్: RRB టెక్నీషియన్ గ్రేడ్-1 సీబీటీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను సంబంధిత రీజినల్ ఆర్‌ఆర్‌బీ https://rrbsecunderabad.gov.in/ వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందవచ్చు. పరీక్ష రాసిన అభ్యర్థులందరు వ్యక్తగత లాగిన్‌తో వారి స్కోర్‌ను చూడవచ్చు. ఇది ఈ నెల 20 తేదీ వరకే అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. కట్ ఆఫ్ మార్కులను కూడా రైల్వే బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
గత ఏడాది డిసెంబర్ 19 నుంచి 20 మధ్య సీబీటీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం 152 అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ ఉద్యోగాలకు గత మార్చిలో RRB ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 1092 టెక్నీషియన్-1 పోస్టులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి.
Read Also..