- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Free gas cylinders:ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునే వారికి అలర్ట్!

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్(Super Six) పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల(Free gas cylinders) పంపిణీ పథకాన్ని గతేడాది అక్టోబర్ 31 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న‘దీపం-2’ పథకం(‘Deepaam-2’ scheme) ద్వారా ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఇప్పటివరకు గ్యాస్ బుక్ చేసుకోని వారికి ఇది ఆఖరి అవకాశం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకోనివారిని అధికారులు అలర్ట్ చేశారు. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ తీసుకోని వారు.. ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కమిషనర్(Commissioner of Civil Supplies Department) సౌరభ్ గౌర్(Saurabh Gaur) సూచించారు. బుక్ చేసుకోని పక్షంలో లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయని గుర్తు చేశారు.
ఈ పథకం లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. దీనికి రేషన్ కార్డు(Ration Card) ప్రామాణికం. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో వారి పేరు కచ్చితంగా రేషన్ కార్డులో ఉంటేనే రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలో వివరాలు సరిగ్గా ఇవ్వకపోని కారణంగా రాయితీ అందండ లేదు. ఈ క్రమంలో దీపం-2 పథకం లబ్ధిదారులు అర్హత ఉందా? లేదా? అని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉందని అధికారులు చెబుతున్నారు.
Read More..
బంపరాఫర్.. అక్కడ ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్.. యాపిల్ ఫోన్లు