- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Harish Rao : రాష్ట్రంలో చీకటి పాలన : హరీష్ రావు

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్(Jagadish Reddy Suspension) పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(BRS MLA Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఈరోజు చీకటి రోజ(Black Day)ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతు కోసిందని మండిపడ్డారు. సభ బయట ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, సభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం కాంగ్రెస్ పాలన మార్కు అన్నారు. జగదీష్ రెడ్డి గవర్నర్ ప్రసంగంలో తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేశారని, ప్రతిపక్షాల హక్కులు కాపాడాలని ప్రశ్నిస్తే ఆయనను సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
మాట్లాడితే దళిత స్పీకర్(Speaker) అని కాంగ్రెస్ నేతలు ఆయన విలువ తగ్గించే ప్రయత్నం చేసిందన్నారు. దేశంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టింది, దళితులకు రూ.10 లక్షలు ఇచ్చింది తమ పార్టీ అని పేర్కొన్నారు. అంబేద్కర్ ను ఓడించింది కాంగ్రెస్ అని, ద్రౌపది ముర్మును సోనియా అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. నిజానికి జగదీష్ రెడ్డి సభలో ఏకవచనం సంబోధించలేదని, మీరు అనే పదమే వాడారని వివరించారు. 15 నిముషాల కోసం సభ వాయిదా అని, ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆడించిన నాటకం ఇదన్నారు. రేవంత్ రెడ్డి ప్లాన్.. శ్రీధర్ బాబు అమలు చేశారని మండిపడ్డారు.