స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఓయూలో మాజీమంత్రి జగదీశ్ రెడ్డి శవయాత్ర

by Ramesh Goud |
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఓయూలో మాజీమంత్రి జగదీశ్ రెడ్డి శవయాత్ర
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (BRS Leader Jagadeesh Reddy) పై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు (Osmania University Student Leaders) ఫైర్ అయ్యారు. దళిత వ్యక్తి స్పీకర్ గా ఉండటాన్ని సహించలేక బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) అహంకారం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ కు (Speakar), దళిత సమాజానికి వెంటనే క్షమాపణలు (Sorry) చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నాయకులు డప్పు కొట్టుకుంటూ జగదీశ్ రెడ్డి శవయాత్ర (Jagadish Reddy's funeral procession) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి విభాగం నేత వలిగొండ నరసింహా మాట్లాడుతూ.. దళిత స్పీకర్ ఉండడం సహించలేక అహంకారంతో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ అవమానించిన జగదీశ్ రెడ్డి దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

లేనియెడల ఎక్కడికక్కడ అడ్డుకొని ప్రత్యక్ష దాడుల కూడా వెనుకాడమని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. అలాగే దళితులను ముఖ్యమంత్రి చేస్తానని మోసం చే,సి పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో దళితులని నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. నేడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో దళిత సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని, దళితులు ఉన్నత పదవులలో ఉండడాన్ని చూసి ఓర్వలేక, గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ (BRS President KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story