అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల డేటా.. ఆరు నెలల్లో రెండో ఘటన

by S Gopi |
అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల డేటా.. ఆరు నెలల్లో రెండో ఘటన
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ యూజర్ల వ్యక్తిగత సమాచారం మరోసారి హ్యాకర్ల బారిన పడింది. కస్టమర్ల డేటా లీక్ అయిందని, గడిచిన ఆరు నెలల కాలంలో బీఎస్ఎన్ఎల్ డేటా హ్యాకింగ్‌కు గురవడం ఇది రెండోసారి అని డిజిటల్ రిస్క్ మేనేజ్‌మెంట్ సంస్థ ఎథీనియన్ టెక్నాలజీ నివేదిక పేర్కొంది. తాజాగా లీక్ అయిన డేటాలో సిమ్ కార్డుల వివరాలతో పాటు ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ, హోమ్ లొకేషన్ లాంటి సున్నితమైన సమాచారం ఉంది. బీఎస్ఎన్ఎల్‌కు చెందిన మొత్తం 278జీబీ డేటాను కిబర్ ఫాంటోం అనే హ్యాకర్ 5000 డాలర్లు అమ్మకానికి పెట్టాడు. ఈ డేటాను ఉపయోగించి నకిలీ సిమ్ కార్డులు సృష్టించేందుకు అవకాశం ఉందని, అంతేకాకుండా వ్యక్తిగత అకౌంట్లను యాక్సెస్ చేయవచ్చని, సైబర్ దాడులకు, మోసాలకు పాల్పడవచ్చని అథెంటియన్‌ టెక్నాలజీస్‌ అభిప్రాయపడింది. కాగా, గతేడాది డిసెంబర్‌లో సైతం బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్‌లైన్ యూజర్ల డేటా హ్యాకర్ల బారిన పడింది. మరో నెలరోజుల్లో బీఎస్ఎన్ఎల్ సంస్థ దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో డేటా హ్యాకింగ్‌కు గురవడం కొంత కలవరం రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed