Sudheer Babu : పెళ్లి వీడియో షేర్ చేసిన హీరో సుధీర్ బాబు.. అప్పుడు మహేష్ ఎలా ఉన్నాడంటే?

by Prasanna |   ( Updated:2024-09-29 03:12:21.0  )
Sudheer Babu : పెళ్లి వీడియో షేర్ చేసిన హీరో సుధీర్ బాబు.. అప్పుడు మహేష్ ఎలా ఉన్నాడంటే?
X

దిశ , వెబ్ డెస్క్ : హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి బావ అవుతాడన్న విషయం మనకీ తెలిసిందే. మహేష్ చెల్లి పద్మ ప్రియదర్శిని, సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరిద్దరి పెళ్లి కృష్ణ ఘనంగా చేసారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నటీ నటులు, రాజకీయ ప్రముఖులు మొత్తం హాజరయ్యారు.అయితే, తాజాగా సుధీర్ బాబు తన పెళ్లి వీడియోని షేర్ చేసారు.

తన పెళ్లి వీడియోని కట్ చేసి సుధీర్ బాబు ఇన్స్టా లో షేర్ చేసాడు. ఇది కొద్దీ నిముషాల్లోనే వైరల్ అయింది. ఈ వీడియోలో మహేష్ బాబు ఇద్దర్ని ఆశీర్వదించడం, కృష్ణ కుటుంబం మొత్తం కనిపించడంతో మహేష్ అభిమానులు ఈ వీడియోని లైక్ చేస్తున్నారు.

త్వరలో సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా నుంచి ‘వేడుకలో ఉన్నది కాలం వేదిక ఈ కళ్యాణం..’ అంటూ ఓ పెళ్లి పాటను విడుదల చేసారు. ఆ మూవీ పాటకి తన పెళ్లి వీడియోని అటాచ్ చేసి షేర్ చేసాడు సుధీర్ బాబు.

Advertisement

Next Story