Chicken Rates: నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన చికెన్ ధరలు

by Kavitha |
Chicken Rates: నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన చికెన్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: బేసిక్‌గా నాన్​ వెజ్​ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. వారంతో సంబంధం లేకుండా మ్యాగ్జిమమ్ వీక్లీ 3,4 సార్లు లాగించేస్తుంటారు. ఇంకా స్పెషల్‌గా ఆదివారం వచ్చిందంటే చాలు దాదాపు అందరి ఇళ్లలో నాన్​వెజ్‌ వంటలు ఘుమఘమలాడుతుంటాయి. చికెన్​, మటన్​, ఫిష్​, ప్రాన్స్​ అంటూ నచ్చిన వాటిని తెచ్చుకుని ఫ్యామిలీతో కలిసి తింటూ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇక ఆ రోజున షాపుల ముందు క్యూ సంగతి చెప్పక్కర్లేదు. మాంసం కోసం ఉదయం నుంచి షాపుల వద్ద బారులు తీరుతారు. అంత ఇష్టం నాన్​వెజ్ అంటే​. అయితే చాలా మంది నాన్‌వెజ్‌ప్రియులు చికెన్‌ను ఎక్కువ ఫ్రిపర్ చేస్తారు. ఎందుకంటే సామాన్యులు సైతం దీనికి కొనుక్కోని తినగల స్తోమత ఉంటుంది కాబట్టి. అలాంటి నాన్​వెజ్​ ప్రియులకు ఓ షాకింగ్​ న్యూస్​. అది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర మళ్లీ పెరుగుతుంది. ఈ నెల స్టార్టింగ్‌లో కేజీ స్కిన్‌లెస్ ధర రూ.160-180 మధ్య ఉండగా.. అది కాస్త 2 వారాల కిందట రూ.200 పలికింది.. ఇక గత వారం రూ.243గా ఉంది. ఇక ఈ రోజు కేజీ స్కిన్‌లెస్ రేట్ రూ.260 ఉంది. కాగా దసరా పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నాన్‌వెజ్ ప్రియులు కొంత నిరాశకి గురైతున్నారు. అయితే రేట్లు ఎంత ఉన్నా తినడం మాత్రం పక్కా అది వేరే విషయం అనుకోండి.

Advertisement

Next Story