ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులకు యువకుడి ఆత్మహత్య

by Mahesh |
ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులకు యువకుడి ఆత్మహత్య
X

దిశ, భీమదేవరపల్లి: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముల్కనూర్ గ్రామానికి చెందిన మాడుగుల అనిల్ (29) డిగ్రీ పూర్తి చేసి, ఉపాధి కోసం హన్మకొండలో ఆరు నెలల క్రితం హోటల్ పెట్టాడు. హోటల్ బిజినెస్ సరిగా నడవక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నెల రోజుల క్రితం ముల్కనూరులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మొదలుపెట్టాడు. హోటల్ కోసం 12 లోన్ యాప్‌లలో సుమారు రూ.9 లక్షల వరకు అప్పులు తీసుకున్నాడు. అప్పులు చెల్లించాలంటూ లోన్ యాప్ వేధింపులు ఎక్కువయ్యాయి. లోన్ యాప్ వాళ్ళు తరచూ ఫోన్ చేసి వేధించేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక, శనివారం అర్ధరాత్రి క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. కాగా ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed