దసరా బంపర్ ఆఫర్లు..రూ.99కే మేక..రెండు ఫుల్ బాటిల్స్..ఇంకా..!

by Y. Venkata Narasimha Reddy |
దసరా బంపర్ ఆఫర్లు..రూ.99కే మేక..రెండు ఫుల్ బాటిల్స్..ఇంకా..!
X

దిశ, వెబ్ డెస్క్ : దసరా సమీపిస్తున్న వేళ తెలంగాణ పల్లెల్లో వ్యాపారస్తులు విచిత్రమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న తీరు వైరల్ గా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బంపర్ ఆఫర్లు, లక్కీ డ్రాల పేరుతో విచిత్రమైన దసరా ఆఫర్లు ఇస్తున్నారు. రామన్నపేట, చండూర్, చిట్యాల, మర్రిగూడ, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో సోషల్ మీడియాలో దసరా ఆఫర్లు వైరల్ గా మారాయి. రూ. 99కొట్టు మేకను పట్టు అని ఒకరు.. రూ. 51 రూపాయలు కొట్టు.. మేకను పట్టుకో అని మరికొందరు గ్రామాల్లో బంపర్ ఆఫర్లతో పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు.

చండూర్ లో రూ.99 కూపన్ స్కీమ్ లో మొదటి బహుమతి కింద 10 కిలోల మేక, రెండో బహుమతి కింద రెండు లిక్కర్ ఫుల్ బాటిళ్లు, మూడో బహుమతిగా కాటన్ బీర్లు, నాలుగో బహుమతిగా రెండు నాటు కోళ్లు ఇస్తామని, ఇలా 10మంది డ్రా విజేతలకు రకరకాల బహుమతులు ప్రకటించారు. దసరా ధమాకాగా ప్రచారం చేస్తున్న ఈ ఆఫర్ రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ అనుసరిస్తున్నారు. పోతే 50 లేదా 100 రూపాయలు పోతాయని లక్కుంటే అంతకంటే ఎక్కువ ధరతో కూడిన ఆఫర్ వస్తువులు దక్కుతాయంటూ మందు బాబులు..మటన్ ప్రియులు ఈ విచిత్ర ఆఫర్ల పట్ల ఆకర్షితులవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed